అత్యంత డేంజర్‌ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్‌ | Is Anasuya Bharadwaj Role Dakshayani Kills Her Husband In Pushpa Movie | Sakshi
Sakshi News home page

Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్‌

Published Sat, Dec 4 2021 2:57 PM | Last Updated on Sat, Dec 4 2021 3:34 PM

Is Anasuya Bharadwaj Role Dakshayani Kills Her Husband In Pushpa Movie - Sakshi

బుల్లితెర యాంకర్స్‌లో అత్యంత క్రేజ్‌ సంపాదించుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్‌. తన వ్యాఖ్యానంతో బుల్లితెర.. గ్లామర్‌లో వెండితెరపై దూసుకుపోతోంది. సినిమాల్లో ఆమె కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ ఆ పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. గ్లామరైన, డీ-గ్లామరైన ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. దీనికి రంగస్థలంలో ఆమె పోషించే రంగమ్మత్త పాత్రే ఉదాహరణ. అలా సినీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అనసూయ.

చదవండి: తన ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం

రెగ్యూలర్‌గా యాంకరింగ్‌ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు చేస్తున్న అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీలో అనసూయ ద్రాక్షాయణి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోహీరోయిన్, విలన్‌ తర్వాత అనసూయ పాత్ర కీలకం అనే టాక్‌ నడుస్తోంది. ఇందులో అనసూయ సునీల్‌కు భార్యగా కనిపిస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్ర అనసూయ సొంతమని ఈ మూవీ టీం సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

చదవండి: ప్రియమణిపై అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌

అంతే కాదు ఇందులో మంగళం శ్రీనుగా నటిస్తున్న సునీల్‌ను అనసూయ అత్యంత దారుణంగా చంపేస్తుందని ప్రచారం జరుగుతోంది.  ఆ సీన్ కూడా ఎవరూ ఊహించని విధంగా సుకుమార్ డిజైన్ చేశాడట. ట్రైలర్‌కు ముందు విడుదలైన టీజర్ ఒకసారి పరిశీలించి చూస్తే ఇందులో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ టీజ్‌లో ద్రాక్షాయణిగా అనసూయను జస్ట్‌ అలా చూపించారు. ఆ సమయంలో అనసూయ నోటితో బ్లేడ్‌ పట్టుకుని కోపంగా చూస్తు ఎదురుగా ఉన్న వ్యక్తిని చంపినట్లు కినిపంచింది. ఆ సీన్‌లో అనసూయ చేసిన పర్ఫార్మెన్స్‌.. రంగమ్మత్త కంటే ద్రాక్షాయణిగా ఆమెకు మరింత గుర్తింపు రావడం ఖాయమంటున్నారు. రెండు భాగాలుగా విడుదలవుతోన్న ‘పుష్ప’ మూవీ ఇప్పటికే పార్ట్‌ 1ను పూర్తి చేసుకుంది. పుష్ప ది రైజ్‌ అనే టైటిల్‌తో మొదటి పార్ట్‌ను డిసెంబర్‌ 17న విడుదల చేయబోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement