Anasuya Emotional Comments After Watched Pushpa In Amazon Prime - Sakshi
Sakshi News home page

నాకు, నా కెరీర్‌కు గేమ్‌ చేంజర్‌ మూవీ అది.. అనసూయ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sat, Jan 8 2022 4:24 PM | Last Updated on Sat, Jan 8 2022 6:58 PM

Anasuya Emotional Comments After Watched Pushpa In Amazon Prime - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసి బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. వెండితెరపై జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్న పుష్ప రాజ్‌.. సడన్‌గా ఓటీటీకి ఎంట్రీ అందరిని ఆశ్చర్యపరిచాడు. శుక్రవారం(జనవరి 7)నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘పుష్ప’స్ట్రీమింగ్‌ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా ఓటీటీలో ‘పుష్ప’మూవీ చూసి మరోసారి అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా బుల్లితెర యాంకర్‌ అనసూయ కూడా ఫ్యామిలీతో కలిసి ఇంటో మరోసారి ‘పుష్ప’సినిమాను వీక్షించింది. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ‘నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి’ అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో ఆమె ఉన్న సన్నివేశాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. 

ఈ మూవీలో నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న దాక్షాయణి పాత్రలో అనసూయ నటించిన విషయం తెలిసిందే. సునీల్‌కి భార్యగా నటించి, మెప్పించింది. ఇందులో మంగళం శ్రీను(సునీల్‌), దాక్షాయణి పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమాకు చాలా ప్లస్‌ అయింది.సెకండాఫ్‌లో ఈ ఇద్దరి క్యారెక్టర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement