కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే.. బండి సెటైర్లు | Bandi Sanjay Satirical Comments On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే.. బండి సెటైర్లు

Published Fri, Aug 25 2023 12:09 PM | Last Updated on Fri, Aug 25 2023 12:31 PM

Bandi Sanjay Satirical Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే అంటూ పొలిటికల్‌ పంచ్‌లు విసిరారు. నటనలో కేసీఆర్‌ను మించినోడు లేడంటూ సెటైర్‌ వేశారు. 

కాగా, బండి సంజయ్‌ శుక్రవారం మీడియాతో మాట్లడుతూ.. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్రుడిపై కూడా భూమలిస్తానంటాడు. కేసీఆర్‌ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే. ఒకరికి టికెట్‌ ఇచ్చి.. మరొకరిని ఇంటికి పిలుస్తున్నాడు. యాక్టింగ్‌లో కేసీఆర్‌ను మించిన వ్యక్తి మరోకరు లేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

అది బీజేపీకి మాత్రమే సాధ్యం..
మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయింది. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉంది. రూ.6వేల కోట్లు ఇచ్చి నన్ను ఓడించాలని చూశారు. ప్రజలు న్యాయంవైపు ఉండి నన్ను గెలిపించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. నాలుగేళ్లలో ఎక్కడా కూడా కాంగ్రెస్‌ గెలవలేదు. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి తప్ప మరో పార్టీకి లేదు.

తెలంగాణలో నియంతపాలన పోవాలని ఇక్కడికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌ షాలు వస్తున్నారు. కేవలం మోదీ చేతుల్లోనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. ఈనెల 27వ తేదీన ఖమ్మంలో అమిత్‌ షా సభ ఉంటుంది. వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ సభకు హాజరు కావాలని ప్రజలను కోరుతున్నాను. కేసీఆర్‌కు పేదా, ధనికా తెలియదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: నాగార్జునసాగర్ బరి నుంచి తప్పుకున్న సీనియర్ నేత జానారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement