సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వం ఇప్పడికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి రాగానే హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తాం. పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బుల్డోజర్లు ముందుగా మామీద నుండి వెళ్లాలి. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్తాయి. తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తగులుతుంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. భూమి పట్టాలు, లింకు డాక్యుమెంట్స్, గ్రామా పంచాయితీ అనుమతి ఉన్న వారి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న వాళ్లంతా పేదలే. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఇప్పటికైనా హైడ్రాపై ప్రభుత్వం సమీక్ష చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక పిల్లి గంతులు వేస్తున్నారు. బ్యాంకులు 73 లక్షల మందికి రుణాలు ఇచ్చామని చెబుతున్నారు.. 48 లక్షల మందికి అని రేవంత్ రెడ్డి చెప్పారు. 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మేడ్చల్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బీజేపీ దీక్ష చేపట్టింది. అప్పులపాలై రుణమాఫీ కానీ రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి. రైతు బంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రేవంత్ వాలకం చూస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి కలిసికట్టుగా పోరాటం చేద్దాం
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. రేపు ధర్నా చౌక్‌లో రైతు దీక్ష చేపడుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నాం. రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: కూల్చివేతలపై హైడ్రా మరోసారి ఆలోచించాలి: దానం నాగేందర్
Comments
Please login to add a commentAdd a comment