
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. మరోవైపు.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆదిలాబాద్ సభలో కేసీఆర్ సర్కార్ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇక, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం. నేను నా తోటి తెలంగాణ ఉద్యమకారులం సంవత్సరాలుగా చెబుతున్న వాస్తవాలు, మా ప్రజల ఆలోచనకు, అవగాహనకు చేరుతున్నట్లు ఇప్పుడిప్పుడే అన్పిస్తున్నది’ అంటూ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలల్ల బీఆర్ఎస్ గెలుపుకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి..
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 10, 2023
దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం..
నేను నా తోటి తెలంగాణ… pic.twitter.com/t7Fs9MaSJ9
మరోవైపు.. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దానిని బీజేపీకి అనుకూలంగా ఓట్లుగా మార్చేకునే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటును అందించేందుకు జాతీ య నాయకత్వం సిద్ధం ఉందని హామీ నిచ్చారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్లాన్.. 17 రోజులు.. 41 సభలు
Comments
Please login to add a commentAdd a comment