సాక్షి, తిరుపతి: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత కరెంట్‌పై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఉచిత కరెంట్ అంశంపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే, భట్టి విక్రమార్క ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. ఇక, తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం, భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది. దివంగత సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. ఉచిత కరెంట్ పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అంతకు ముందు టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే..
Comments
Please login to add a commentAdd a comment