Free current for farmers
-
కాంగ్రెస్ సీఎం ఎవరు?.. భట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, తిరుపతి: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత కరెంట్‌పై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఉచిత కరెంట్ అంశంపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, భట్టి విక్రమార్క ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. ఇక, తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం, భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దివంగత సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. ఉచిత కరెంట్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతకు ముందు టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే.. -
రైతులకు ఉచిత కరెంట్‌పై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
రైతన్నకు సౌరశక్తి.. తొలి అడుగు పడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్ అందించేందుకు తొలి అడుగు పడింది. వచ్చే 30 ఏళ్లపాటు నిరంతరాయంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక మెగా సోలార్ ప్రాజెక్టును పట్టాలపైకి తెచ్చింది. రైతన్నకు మరింత ఊతం ఇవ్వబోతున్న ఈ మెగా సోలార్‌తో... యూనిట్ కేవలం రూ.2.48కే అందబోతోంది. ఫలితంగా మొదటి సంవత్సరంలోనేరూ.3,836 కోట్లు ఆదా అవుతాయి. మొత్తంగా వచ్చే 30 ఏళ్లలో ఈ మెగా సోలార్‌తో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.2 లక్షల కోట్లు ఆదా కాబోతోంది. ఏటా 14వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఏటా దాదాపు 14 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. గతంలో డిస్కమ్‌లకు ఈ సబ్సిడీ చెల్లింపులు అరకొరగానే ఉండేవి. దీంతో విద్యుత్ సంస్థలు భారీ అప్పుల్లో కూరుకుపోయి మనలేని స్థితికి చేరాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో దాదాపు రూ.17,900 కోట్లు విద్యుత్ సంస్థల చేతికందేలా చర్యలు తీసుకుంది ఇక ఈ ఏడాది సబ్సిడీ దాదాపు రూ.9 వేల కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న సబ్సిడీకి కారణం టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా, భారీ ధరలకు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలే. మరి దీన్ని నియంత్రించటమెలా? ఎక్కడో ఒకచోట కళ్లెం వేయకపోతే భవిష్యత్తు భయంకరంగా తయారవుతుంది కదా? ఇదే ఉద్దేశంతో సబ్సిడీ భారాన్ని నియంత్రించడానికి కదిలిన ప్రభుత్వం.. వ్యవసాయానికి చౌక విద్యుత్ అందించడానికి 6,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి కావాలి. అందుకే ‘బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ)’ పద్ధతిలో మెగా సోలార్కు టెండర్లు పిలిచింది. నిర్మాణ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలవగా... ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ముందే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించింది. విద్యుత్ దిగ్గజాలు ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ సహా మరికొన్ని సంస్థలు పోటీపడ్డాయి. పది ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం 24 బిడ్లు వచ్చాయి. రివర్స్ టెండరింగ్ చేపట్టడం వల్ల సోలార్ విద్యుత్ యూనిట్ కనిష్టంగా రూ.2.48కే లభించే వీలు కలిగింది. టెండర్లను ఖరారు చేసిన గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్... రివర్స్ టెండరింగ్‌తో తొలి ఏడాదే రూ.3,836 కోట్ల ప్రజాధనం ఆదా అవుతున్నట్లు తెలియజేసింది. టీడీపీ అడ్డగోలు ఒప్పందాలు... విద్యుత్ నిర్వహణలో విద్యుత్ కొనుగోళ్ళే కీలకం. కాకపోతే 2014–19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది. 2014లో రూ.33,500 కోట్లు ఉన్న విద్యుత్ రంగం అప్పులు... టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా జరిపిన ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు, అవినీతి కారణంగా 2019 మార్చి చివరినాటికి రూ.70,250 కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల చెల్లింపులు రూ.2,893 కోట్ల నుంచి ఏకంగా రూ.21,500 కోట్లకు చేరాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.19920 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రయివేటు సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ళను తెలుగుదేశం అవసరానికి మించి ప్రోత్సహించి... సోలార్కు యూనిట్‌కు రూ. 5.25 నుంచి రూ.5.90 వరకూ చెల్లించేలా... అది కూడా పాతికేళ్ల పాటు అమల్లో ఉండేలా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయా ప్రయివేటు విద్యుత్ సంస్థలు చెల్లించే ఆదాయపు పన్నును, ఎలక్ట్రిసిటీ డ్యూటీని తిరిగి వాళ్లకు రిఫండ్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇవి కూడా కలిపితే యూనిట్ విద్యుత్ ఖరీదు చాలా ఎక్కువ. ఫలితంగా విద్యుత్ సంస్థలపై మోయలేని భారం పడింది. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 4.84 చొప్పున చెల్లించేలా ఏకంగా 41 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంది. ఈ ధరకు ఆదాయపు పన్ను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీఫండ్ అదనం. పైపెచ్చు పవన, సౌర విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్‌ను తగ్గించి, స్థిర ఛార్జీలు వృధాగా చెల్లించింది. చిత్రమేంటంటే టీడీపీ ప్రభుత్వం నామినేషన్లపై ఇలా ఏకపక్షంగా రూ.4.84 చెల్లించి పీపీఏలు చేసుకున్న సంవత్సరంలోనే... అంటే 2017లోనే గుజరాత్ ప్రభుత్వం టెండర్లు పిలిచి యూనిట్‌ను రూ.2.43కే కొనుగోలు చేసింది. దీన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో తేలిగ్గా అర్థమవుతుంది. తాజాగా మెగా సోలార్ ప్రాజెక్టులో భాగంగా యూనిట్ రూ.2.48కే వస్తుండటంతో... సబ్సిడీ కష్టాలకు చెక్‌పడి, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందనుంది. -
రైతులకు 9గంటలు ఉచిత విద్యుత్
-
రేపటి నుంచి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్
-
ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలని తన ఆలోచన అన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. స్కూళ్లు, ఆస్పత్రులలో చెట్లను నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్ఆర్ కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. నిర్ణిత సమయంలో వాటిని పూర్తి చేయాలి రైతులకు ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రాధన్య అంశంగా భావించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జనన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చించారు. ఉచిత విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్ల వారిగా ప్రణాళిక ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 57వేలకు పైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు సీఎంకు తెలిపారు. నిర్ణిత సమయంలో వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్ ఆధికారులను ఆదేశించారు. -
బాబు జమానా.. రైతుకు షాక్
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): అన్నదాతలు కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయారు. వరుణుడి కరుణ లేక వర్షాధార పంటలన్నీ తుడిచిపెట్టుకుపోగా.. బోరుబావుల్లో వచ్చే అరకొర నీటితోనైనా పంటలు వేద్దామంటే ప్రభుత్వం కరుణ చూపడం లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో వేలాది రూపాయలు ధారబోసి బోర్లు వేయించుకున్న రైతులు పంటలను సాగు చేసుకోలేకపోతున్నారు. ఏళ్ల తరబడి విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. కనెక్షన్లు మాత్రం మంజూరు కావడం లేదు. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోటా తగ్గించి..రైతులను వేధించి.. తమది రైతు ప్రభుత్వమని, వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చంద్రబాబు తరచూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే..ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరించారు. మరోవైపు అర్హులైన రైతులు ఉన్నప్పటికీ కొత్త వారికి కనెక్షన్లు మంజూరు చేయకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనా కాలమంతా ఇదే పరిస్థితి. దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ కనెక్షన్ రాకపోవడంతో బోరుబావులను నిరుపయోగంగా ఉంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రైతులు ఇటు పంటలను, అటు ఆర్థికంగాను నష్టపోతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35,638 మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. వైఎస్సార్ పథకానికి తూట్లు రైతు సంక్షేమం కోసం వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ (త్రీఫేజ్) అందించేందుకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారు. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. మొదటి ఏడాదే జిల్లాకు రూ.39.74 కోట్లతో 5,085 కనెక్షన్లు మంజూరు. తర్వాత ప్రతియేటా కోటా పెంచుతూ వెళ్లారు. వైఎస్సార్ పుణ్యమా అని జిల్లాలో ఇప్పటికి దాదాపు 1.50 లక్షల కనెక్షన్ల ద్వారా ఉచిత విద్యుత్ అందుతోంది. అయితే..చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఉచిత విద్యుత్ పథకానికి క్రమేణా తూట్లు పొడుస్తూ వచ్చారు. 2018–19 సంవత్సరంలో అర్హులైన జిల్లా కోటాను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేశారు. సాధారణంగా ఏటా జనవరి– ఫిబ్రవరి మాసాల్లో పెండింగ్ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా మొత్తం కోటా విడుదల చేయాలని సీఎండీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ మాసంలోనే కోటాను విడుదల చేయాలి.అయితే..ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. కనెక్షన్లు ప్రశ్నార్థకమే ఎన్నికల కోడ్, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం కొత్త కనెక్షన్ల మంజూరు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు కోటాను, సర్వీసులను సకాలంలో విడుదల చేయకపోవడంతో పెండింగ్ దరఖాస్తులు 35,638కి చేరుకున్నాయి. ఇప్పటికే డీడీల రూపంలో 13,553 మంది రైతులు డబ్బు చెల్లించారు. వీరి మొత్తం రూ.7,62,35,625లు ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు చేరింది. డబ్బు చెల్లించినా కనెక్షన్లు రాకపోవడంతో రైతులు వేదన చెందుతున్నారు. -
రైతులంటే పగ ఎందుకు?: వాసిరెడ్డి పద్మ
* టీడీపీ అధినేత చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం * ఉచిత విద్యుత్‌కు ఆధార్‌తో లింకు పెట్టడం దారుణం * ఎన్నికల ముందు ఆధార్ కార్డంటే ఖబడ్దార్ అన్నారు.. * ఇప్పుడేమో ఆధార్ సాకు చూపి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులను ఆదుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సౌకర్యం పొందాలంటే ఆధార్ కార్డు ఉండి తీరాలని చంద్రబాబు ప్రభుత్వం షరతు విధించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 20వ తేదీలోపుగా ఆధార్ వివరాలు ఇవ్వకపోతే ఆ మరుసటి రోజు నుంచే ఉచిత విద్యుత్ ఉండదని చెప్పడం, గడువు కూడా పొడిగించకపోవడం సరికాదన్నారు. గురువారం ఆ మె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం 13.50 లక్షల విద్యుత్ కనెక్షన్లలో 40 శాతం మంది రైతులకు ఉచిత విద్యుత్ పథకం దక్కకుండా పోతోందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు ‘ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్ లింకా... సబ్సిడీ బియ్యం కోసం ఆధార్ కావాలా..?’ అంటూ విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక అదే ఆధార్‌ను ఆయుధంగా చేసుకుని పథకాల్లో కోత విధిస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. ఆధార్ పేరు చెప్పి రాష్ట్రంలో 10 లక్షల సామాజిక పింఛన్లు, 23 లక్షల రేషన్ కార్డులను కత్తిరించారని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ఆధార్ ను ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం శోచనీయమన్నారు. వృద్ధులు, పేదలపై చంద్రబాబుకు పగ ఎందుకు? రైతులంటే కోపమెందుకు అని ఆమె ప్రశ్నించారు. అంతా మిథ్య అనుకుంటున్నారా? ‘‘నాడు ఆధార్ అంటే ఖబడ్దార్ అని చెప్పిన చంద్రబాబు ఇపుడు ప్రతిదానికీ ఆధార్ జపం చేస్తున్నారు.. ఉచిత విద్యుత్‌కు కూడా ఆధార్‌తో లింకు అంటున్నారంటే దాని ఉద్దేశం ఏమిటి? పంట భూమి ఉండటం అబద్ధమా? రైతు అబద్ధమా? అంతా మిథ్య అనుకుంటున్నారా?’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వాస్తవానికి బాబు మనసున్న సీఎం కానే కాదని, పదిమందికీ సాధ్యమైనంత ఎక్కువగా మేలు చేద్దామనే ఆలోచన కన్నా రూపాయి, రూపాయి ఎలా మిగుల్చుకుందామనే ఆలోచిస్తూ ఉంటారని ఆమె విమర్శించారు. ఉచిత విద్యుత్ పథకానికి ఆధార్ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఒక చోటి నుంచి మరో చోటుకు మార్చుతున్న క్రమంలో వైఎస్ విగ్రహానికి అపచారం చేశామని ఒక చానెల్, ఒక పత్రిక విషప్రచారానికి పూనుకున్నాయని, వైఎస్ జీవించి ఉండగా ఈ మీడియా యాజమాన్యం వైఎస్ పట్ల ఎంత బాగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు.