సాక్షి, గాంధీ భవన్: తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ భట్టి విక్రమార్క్ సంచలన కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
కాగా, భట్టి విక్రమార్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్టు షాపులను మూయించాలని ప్రజలు మమ్మల్ని అడిగారు. చేనేత కార్మికుఉ జీఎస్టీ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని చూస్తున్నారు. సింగరేణిని బొందపెడుతున్న బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారు. ధరణి పోర్టల్ పేరుతో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..!
Comments
Please login to add a commentAdd a comment