
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌తో ఎంఐఎం పార్టీకి ఉన్న రాజకీయ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏనాడూ అవి ఒకరికొకరు మద్దతు అని ప్రకటించుకున్న దాఖలాలు లేవు. అలాగే పరస్పర విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. దీనిని ఆసరాగా తీసుకునే బీజేపీ.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు చేస్తూ వస్తోంది కూడా. ఈ క్రమంలో తాజాగా మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ స్టీరింగ్ మా చేతుల్లో ఉందని కొందరు అంటుండడం హాస్యాస్పదంగా ఉందంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మేం అడిగిన ఒక్క పని కూడా బీఆర్‌ఎస్ చేయలేదని పేర్కొన్నాయన. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ తీరుపై ఆగ్రహం వెల్లగక్కారు. ‘ఓల్డ్ సిటీలో ఎందుకు మెట్రో నిర్మించడం లేద’ని సర్కార్‌ను నిలదీశారు. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పార్టీపై తొలిసారిగా తీవ్ర విమర్శలకు దిగారు ఒవైసీ. అదీ సూటి విమర్శలతో కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదీ చదవండి: ట్విటర్‌లో రాములమ్మ పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment