
హైదరాబాద్, సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దారుణ ఓటమిపై తెలంగాణవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్‌ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం బీఆర్‌ఎస్ జీరో ఫలితంపై స్పందించారు.
బీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్‌ఎస్ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమైంది. బీఆర్‌ఎస్ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా.. అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment