సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 5గంటలలోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ విధుల్లో చేరకుంటే శాశ్వతంగా తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు. ఈ క్రమంలో రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.
మరోవైపు.. జూనియర్ సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు.
ఇది కూడా చదవండి: TSRTC: చరిత్రలో తొలిసారి.. లాభాల్లోకి 45 డిపోలు.. గట్టెక్కించిన శుభ ముహూర్తాలు
Comments
Please login to add a commentAdd a comment