సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మె కొనసాగుతోంది. కాగా, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా జీపీఎస్‌లు విధుల్లో చేరలేదు. ప్రభుత్వం హెచ్చరించినా తగ్గేదేలే అన్నట్టుగా జీపీఎస్‌లు సమ్మెలో ఉన్నారు. అయితే, కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరినట్టు తెలుస్తోంది.
కాగా, ఉద్యోగులు సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేపీఎస్‌లు తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. గతంలో సమర్పించిన ఒప్పందాన్ని ఉల్లఘించవద్దని ఉద్యోగులకు చెప్పారు. ఇదిలా ఉండగా.. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. తమను రెగ్యులర్ చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. ఇక, రేపటి నుంచి కుటుంబ సభ్యులతో సమ్మెలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment