సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీపై సంచలన విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్ అన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చడం తెలియదన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. ఇదే సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ను మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని కారణాల వల్ల రాములు నాయక్‌కు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పని చేస్తున్నారని ప్రశంసించారు.
మరోవైపు.. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ మూడో సారి హ్యాట్రిక్ కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా!
Comments
Please login to add a commentAdd a comment