సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతలు స్పీడు పెంచారు. కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కార్యచరణను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారు. 1200 మంది విద్యార్తులు బలిదానం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా సర్కార్ యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకై లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాలు మీరు చేసి కేసులు తమ మీద పెడతారా? అంటూ మండిపడ్డారు. పేపర్ లీకేజీపై పోరాడితే బండి సంజయ్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు పథకం ప్రకరమే సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పేపర్స్ లీక్ అయ్యాయని ఆరోపించారు. హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. వాటాలిస్తే గానీ ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేశారని.. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మిగులురాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment