సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో సిటీ చుట్టూ పక్కల భూముల చేతులు మారాయని, వాటి మీద సమగ్ర విచారణ జరగాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ది అక్రమాల చరిత్ర అని, అందుకే ఒకటి, రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యిందన్నారు.
కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ అవసరం లేదని.. గత పదేళ్లలో అభివృద్ధికి బదులు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీఆర్‌ఎస్ దెబ్బ తీసిందని దుయ్యబట్టారు. దేశ అబివృద్ధి కోసం బీజేపీ లో చేరాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి వారి బండారం బయట పెడతామన్నారు.
మేము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పీసీ సెక్రెటరీ గా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికలు ఉంటాయి. చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కాంగ్రెస్‌కి ఓటేశారు. కాంగ్రెస్ గెలవలేదు .. బీఆర్‌ఎస్‌ను ఓడించారు. కాంగ్రెస్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి?
Comments
Please login to add a commentAdd a comment