సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని, వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 28న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్‌పై బీజెపి సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను దోపిడీ దొంగల పార్టీలుగా అభివర్ణించిన కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోషులకు శిక్ష పడుతుందనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ బయటకు తీస్తుందని ఆశిస్తే అది భంగపడ్డట్లే అవుతుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
బీజేపీ అగ్గిలాంటి పార్టీ. బీజేపీపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచిస్తున్నా. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని, కాంగ్రెస్–బీజేపీ ఒక్కటేనని మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పనిచేయాలి. హైదరాబాద్‌లో ఉన్న ముస్లిం సోదరులు మజ్లీస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారు. మజ్లీస్ పార్టీని వ్యతిరేకించే ప్రతిఒక్కరూ బీజేపీ వైపు రావాలి. లక్షమంది అసదుద్దీన్‌లు వచ్చినా... మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
Comments
Please login to add a commentAdd a comment