
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సమక్షంలో ఆరూరి కాషాయకండువా కప్పుకున్నారు.
కాగా, ఆరూరి రమేష్ ఆదివారం బీజేపీలో చేరాలరు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బీజేపీ కండువా కప్పి రమేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమేష్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, వరంగల్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆరూరి నిన్న బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆరూరి వరంగల్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. కాగా, బీజేపీ ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో వరంగల్ సీటు అభ్యర్థిని ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment