సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఆట మొదలైందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనుమరుగుకాబోతుందన్నారు. అలాగే, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీలు చేస్తోందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
కాగా, కిషన్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించబోతుంది. ఫిర్ ఏక్ మోదీ సర్కార్ అని ప్రజలు నినదిస్తున్నారు. మోదీ విశ్వనేతగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనుమరుగు కానుంది. కాంగ్రెస్ ఇంతకంటే ఎదగలేదు. తెలంగాణలో అసలు ఆట మొదలైంది.
రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేరు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు గారడీలు చేస్తున్నారు. గ్యారంటీల అమలు మీద సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి లేదు కానీ.. పార్టీ ఫిరాయింపుల మీదే ఆయన ఫోకస్ పెట్టారు. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేశాం. ట్రిపుల్ తలాక్ రద్దుచేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచాం. బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment