సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో వరద నీరు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక, భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి శుక్రవారం యూసఫ్‌గూడ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం, కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు.. బస్తీలను కూడా బాగుచేయాలి. హైదరాబాద్‌కు 80 శాతం నిధులు వస్తున్నా 8శాతం కూడా వినియోగించడం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పూడిక తీయకపోవడంతో రోడ్లపై డ్రైనేజీ పారుతోంది. వాటర్ వెళ్లే కాలువలు మూసుకోపోయాయి. హైదరాబాద్‌లో బస్తీల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధుల కొరతతో సీవరేజ్ బోర్డు ఇబ్బందిపడుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. భారీ వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు హైటెక్ సిటీ, మాదాపూర్‌కే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నిజమైన హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులతో కలిసి స్వచ్చందంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. ఈ క్రమంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వారికి వివరించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇది కూడా చదవండి: జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్.. ఆఫీసు వద్ద ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment