కిరణ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండగ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. హెల్త్ కార్డుల పథకానికి సంబంధించి 174,175,176 జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు అందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవోలో పొందుపరిచింది.
హెల్త్ కార్డులు పథకంలో చేరే గెజిటెడ్ అధికారులు రూ.120, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.90 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు క్యాష్లెస్ వైద్యసేవలు అంద చేసేందుకు ప్రభుత్వం హెల్త్కార్డుల పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వ జీవో జారీ చేయడంపై సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు నరేంద్రరావు, మురళీకృష్ణ శనివారం హైదరాబాద్లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.