
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి: పొంగులేటి
తెలంగాణలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం లేఖ రాశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ పొంగులేటి లేఖ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం లేఖ రాశారు. సమగ్ర సర్వేను ఆధారం చేసుకుని అనేకమంది అర్హుల పింఛన్లను రద్దు చేశారని, దీంతో వేలాదిమందికి ప్రభుత్వ ఫలాలు అందడం లేదని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో చిరు ఉద్యోగి ఉన్నారని అర్హులున్నా పింఛన్ సదుపాయం కల్పించకపోవడం పట్ల పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ ఆదరించేవారు లేక, తిండి దొరక్క పలువురు వృద్ధులు పస్తులుంటున్నారని వివరించారు. వికలాంగులకు ఆదాయం రాని ఆస్తులున్నా పింఛన్ రద్దు చేయడంతో మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.