పెరగని హెచ్‌ఆర్‌ఏ | HRA not increased till now | Sakshi
Sakshi News home page

పెరగని హెచ్‌ఆర్‌ఏ

Published Sat, Jan 13 2018 7:22 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

HRA not increased till now - Sakshi

తెలంగాణలో నూతన జిల్లాల పునర్విభజన జరిగి 15నెలలు  గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె అలవెన్స్‌)లు పెరగలేదు. ప్రభుత్వం     హెచ్‌ఆర్‌ఏ జీవో విడుదల చేసి ఏళ్లు గడుస్తున్నా..  పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదంటూ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నూతన జిల్లాల ప్రాతిపదికన హెచ్‌ఆర్‌ఏను పెంచి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఆయా జిల్లా కేంద్రాల్లో జనాభాతో నిమిత్తం లేకుండా 20 శాతం పెంచాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. – కరీంనగర్‌ఎడ్యుకేషన్‌

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: ఆర్‌పీఎస్‌ (రివైస్‌డ్‌ పేస్కేల్స్‌) 2015 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ రేట్లను నిర్ణయిస్తూ ప్రభుత్వం 2015 మార్చి 18న జీవో నెంబర్‌ 27ను విడుదల చేసింది. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30 శాతంతో  గరిష్టంగా రూ.20 వేలు నిర్ణయించారు. 2లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌లోని ఉద్యోగులకు 20 శాతంతో గరిష్టంగా రూ.15 వేలుగా నిర్ణయించారు.

అదే విధంగా 50 వేల నుంచి 2 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాలైన ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిద్దిపేట, జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, తాం డూర్, వనపర్తి, గద్వాల్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యపేట , భువనగిరి, కోదాడ, జనగామ, పాల్వంచ, కొత్తగూడెం లోని ఉద్యోగులకు 14.5శాతం, గరిష్టంగా రూ.15 వేలు నిర్ణయించారు. రాష్ట్రంలోని జనాభా 50వేలకు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతం, గరిష్టం రూ.15 వేలు, నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాలు అనగా 8 కిలోమీటర్ల పరిధి మేరకు ఆయా నగరాలు, పట్టణాల హెచ్‌ఆర్‌ఏ రేట్లు వర్తిస్తాయని, ఉద్యోగుల మూల వేతనం(బేసిక్‌పే)ను లెక్కిస్తూ హెచ్‌ఆర్‌ఏను ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో జనాభా తో నిమిత్తం లేకుండా హెచ్‌ఆర్‌ఏ 20 శాతం పెంచాలని ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement