సాక్షి, విజయవాడ: నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి అన్నారు. విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదని.. 87 శాతం విద్యార్థులకు పూర్తిగా చెల్లింపులు చేశామని స్పష్టం చేశారు.
2019 నుంచి ఇప్పటివరకు 4వేల కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.1880 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయని తెలిపారు. అక్రమాలను నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. వివిధ అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్నారు.
చదవండి:
‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’
Comments
Please login to add a commentAdd a comment