పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సర్కారు మోకాలడ్డు
బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోత
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల ఉన్నత విద్యకు టీడీపీ కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ మెయింటనెన్స్ చార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. దీంతో సుమారు ఏటా 12 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏటా పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ (ఫీజు రీయింబర్స్‌మెంట్) కోసం సుమారు రూ.2,700 కోట్ల నుంచి రూ.2,800 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో హాస్టల్ విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీల కింద సుమారు రూ.1,100 కోట్లు వెచ్చించాలి.
కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన ఐదునెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులకు తీవ్ర నిరాశను మిగిలి్చంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,766.77 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్ (మెయింటెనెన్స్–ఎంటీఎఫ్) కింద రూ.776.18 కోట్లు కలిపి మొత్తం రూ.2,542.95 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటానే 75 శాతంగా ఉంటోంది. దీనితో పాటు ప్రధానమంత్రి యశస్వీ పథకం కింద మరో రూ.356 కోట్లను కూడా పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్స్ కేటాయింపుల్లో కలిపేసింది.
ఇక ఆ చెల్లింపులు ప్రశ్నార్థకమే..
ఇక గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు ఆపేసింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ చార్జీలు కలుపుకుని రూ.2,500 కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్ అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment