
అగనంపూడి (గాజువాక): ప్రతీ పేదింటి బిడ్డ ఉన్నత చదువుల్లో రాణించాలని..ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని సీఎం జగన్ తపన..ఆరాటం సఫలీకృతమవుతుండటం సంతోషంగా ఉందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు కృష్ణదేవరాయలు అన్నారు. అమెజాన్ ప్రాంగణ ఎంపిక ప్రక్రియలో ఎంపికైన 13 మందిలో 9 మంది విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్నట్లు తెలిపారు.
వీరికి వార్షిక వేతనం రూ.26 లక్షలు అని చెప్పారు. వీరితోపాటు మరో 13 మంది కూడా 3 సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. ఒకరు రూ.12 లక్షల వార్షిక వేతనం, 12 మందికి రూ.10 లక్షల ప్యాకేజీతో దేవరెవ క్లౌడ్ ఇండియా, ఇన్సిర్క్స్, ఎటర్నల్ రోబోటిక్స్ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు వివరించారు.
కళాశాలలో చేరిన తొలి ఏడాది నుంచి విలువలతో కూడిన విద్యతో పాటు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రత్యేక శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్‌తోపాటు విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచడటంతోపాటు నైతిక విలువలూ పెంపొందిస్తున్నామని చెప్పారు. విజ్ఞాన్ సీఈవో ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment