ఫీజుల వడ్డనకు అడ్డుకట్ట | Barrier to serving fees | Sakshi
Sakshi News home page

ఫీజుల వడ్డనకు అడ్డుకట్ట

Published Fri, Nov 18 2016 2:26 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

ఫీజుల వడ్డనకు అడ్డుకట్ట - Sakshi

ఫీజుల వడ్డనకు అడ్డుకట్ట

- భారీగా స్కూల్ ఫీజుల తగ్గింపునకు విద్యాశాఖ కసరత్తు
- ఫీజు నియంత్రణ నిబంధనల రూపకల్పనకు కమిటీ
- రాష్ట్ర స్థారుులో ఏఎఫ్‌ఆర్‌సీ తరహాలో
- ప్రత్యేక వ్యవస్థ ఆధ్వర్యంలో ఫీజుల ఖరారు  
 
 సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల ఫీజులను భారీగా తగ్గించేందుకు నడుం బిగించింది. జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీల(డీఎఫ్‌ఆర్‌సీ) ద్వారా స్కూల్ ఫీజుల నియంత్రణ కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర స్థారుులో ప్రత్యేక వ్యవస్థ ఆధ్వ ర్యంలో ఫీజులను ఖరారు చేయాలని భావి స్తోంది. ది ఏపీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూ షన్‌‌స (రెగ్యు లేషన్ ఆఫ్ అడ్మిషన్‌‌స అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) యాక్ట్ 1983 ప్రకారం చర్యలు చేపట్టేందుకు సిద్ధ మవుతోంది.

ఫీజుల ఖరారుకు అమలు చేయాల్సిన నిబంధనలను రూపొందించేం దుకు పాఠశాల విద్యా అద నపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, వయోజన విద్య డెరైక్టర్ సత్య నారాయణరెడ్డి, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, హైదరాబాద్ ఆర్జేడీ కృష్ణా రావు, హైదరాబాద్ డీఈవో రమేష్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌తో కొనసాగే ప్రైవేట్ పాఠశాల లతో పాటు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యు కేషన్(సీబీఎస్‌ఈ) స్కూళ్లలోనూ ఫీజుల నియంత్రణకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి పాఠశాలల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయడంతో పాటు, ప్రాంతాల వారీగా కనీస, గరిష్ట ఫీజులను ఖరారు చేసేలా ఆలోచనలు చేస్తోంది.

 ఈసారైనా పక్కాగా జరిగేనా?
 రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు గతంలో అనేక చర్యలు చేపట్టినా వివాదాల వల్ల అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈసా రైనా పక్కాగా చేస్తారా? లేదా? అన్న అను మానాలు తల్లిదండ్రుల్లో నెలకొన్నా రుు. 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభు త్వం జీవో 91, 92లను జారీ చేసింది. వాటి ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్ఠంగా రూ. 24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ. 30 వేలు ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. అరుుతే ఆ ఉత్త ర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రరుుంచారుు. పాఠశాల స్థారుులో గవర్నిం గ్ బాడీలు ఫీజులను ఖరారు చేసినపుడు, మళ్లీ జిల్లా స్థారుులో డీఎఫ్‌ఆర్‌సీలు ఎలా ఫీజులను నిర్ధారిస్తాయని పేర్కొనడంతో జీవో 91లోని డీఎఫ్‌ఆర్‌సీలను కోర్టు కొట్టి వేసింది. ఆ తరువాత విద్యా హక్కు చట్టం అమలుకు జీవో 41, 42ను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ శాలల్లో పట్టణప్రాంతాల్లో అరుుతే ఏడాదికి గరిష్టంగా రూ. 9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అరుుతే ఆ జీవోల పైనా యాజమాన్యాలు కోర్టును ఆశ్రరుుం చారుు. దీంతో వాటి అమలు ఆగిపోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement