నిరుద్యోగ యువతకు పోలీస్ శిక్షణ | Police training for unemployed youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు పోలీస్ శిక్షణ

Published Wed, Jan 8 2014 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 8:16 PM

Police training for unemployed youth

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : గిరిజన నిరుద్యోగ యువతకు మిలిటరీ, సీఆర్‌పీఎఫ్, పో లీస్ శాఖల ఉద్యోగాలకు సంబంధించి  శిక్షణ ఇచ్చేందుకు పార్వతీపురంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్‌డీ ప్రవీణ్ తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండ లం తాడికొండ గ్రామంలో మంగళవారం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రా మం నుంచి కనీసం ఐదుగురు యువకులు పోలీస్ శాఖలో పనిచేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కేంద్రం పనిచేస్తుందన్నారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. సాలూరు, మక్కువ, కొటియ, కొమరాడ ప్రాంతంలో కొద్దిగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నా ఆంధ్రా-ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలింపు చ ర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాచిపెం ట, సాలూరు, కొటియా ప్రాంతాల్లో రెండు లైన్ల రహదారి నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement