27న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు | Interviews to unemployed youth on 27th | Sakshi
Sakshi News home page

27న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు

Published Mon, Jul 25 2016 9:49 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

27న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు - Sakshi

27న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు

కడప కోటిరెడ్డి సర్కిల్‌ :
జిల్లా కేంద్రమైన కడప పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈనెల 27వ తేదిన నిరుదోయగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వి.సుస్మితప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్‌ చిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికైన వారికి వేతనం కింద నెలకు రూ. 8–10 వేల వరకు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మాధవరం, సుండుపల్లె,
ఖాజీపేట, ప్రొద్దుటూరు, బద్వేలు ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇతర వివరాలకు 98663 04624  నెంబరులో సంప్రదించాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement