వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం పలువురు నిరుద్యోగ యువతీ, యువకులు కలిశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం పలువురు నిరుద్యోగ యువతీ, యువకులు కలిశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడలేదని వారు ఈ సందర్భంగా ఆయనకు తెలిపారు. నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోయారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచి, తమ అవకాశాల మీద తీరని దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్నా, ఏపీ ప్రభుత్వంలో కనీస స్పందన లేదని నిరుద్యోగ యువతీ యువకులు చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటికి తొమ్మిది నెలలైనా ఇప్పటికి కనీసం ఒక్క జాబు కూడా రాలేదని తెలిపారు. తమ సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరామని, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ తమకు భరోసా ఇచ్చారని నిరుద్యోగులు చెప్పారు.