యువతకు ఉపాధి... అమరులకు ఆదరణ  | Congress announced Hyderabad Youth Declaration Sarurnagar sabha | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి... అమరులకు ఆదరణ 

Published Tue, May 9 2023 12:53 AM | Last Updated on Tue, May 9 2023 9:11 AM

Congress announced Hyderabad Youth Declaration Sarurnagar sabha - Sakshi

‘హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌’ పోస్టర్‌ను విడుదల చేస్తున్న ప్రియాంకా గాంధీ, మాణిక్‌ రావ్‌ ఠాక్రే రేవంత్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, గల్ఫ్‌ కార్మికులను ఆకట్టుకునేలా కాంగ్రెస్‌ పార్టీ ‘హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌’ను ప్రకటించింది. మొత్తం ఐదు అంశాలతో కూడిన 17 హామీలను ప్రకటించింది. సోమవారం సరూర్‌నగర్‌లో జరిగిన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ డిక్లరేషన్‌ వివరాలను వెల్లడించారు. ఆ అంశాలివీ..  

అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు 
► తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రా­ణా­లర్పించిన యువతీ, యువకులకు ఉ­ద్య­మ అమరవీరులుగా గుర్తింపు. వారి కు­టుం­బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో­పాటు కుటుంబానికి నెలకు రూ.25 వేల పింఛన్‌. 
► ఉద్యమంలో పాల్గొన్నవారిపై నమోదైన కేసుల ఎత్తివేత. జూన్‌ 2న వారికి తెలంగా­ణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. 

పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు 
► కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏ­డాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. 
► తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ. 
► ఏటా జూన్‌ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్‌ కేలండర్‌ ప్రకటన. ఉద్యోగ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్‌ 17న నియామక పత్రాల అందజేత. 
► నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ.4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. 
► ప్రత్యేక చట్టం ద్వారా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు. 

నిరుద్యోగ నిర్మూలన 
► తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ‘సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌’ ఏర్పాటు. ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్ఛంజీ ఏర్పాటు. ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా శిక్షణ. 
► ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్‌ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్లు. 
► విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమిషన్ల తరహాలో యూత్‌ కమిషన్‌ ఏర్పాటు. ఆ కమిషన్‌ ద్వారా రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం. 
► ప్రత్యేక గల్ఫ్‌ విభాగం ఏర్పాటుతో 
గల్ఫ్‌ ఏజెంట్ల నియంత్రణ. గల్ఫ్‌ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతోపాటు కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్‌ వ­ర్గా­ల విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు. రూ.4 వేల కోట్ల బకాయిల చెల్లింపు. 
► పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీలను ఇంటిగ్రేటెడ్‌ యూని­వర్సి­టీలుగా మార్చడంతోపాటు.. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్‌లలో నూతన ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీల ఏర్పాటు. 
► బాసరలో ట్రిపుల్‌ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు. 
► అమెరికాలోని ఐఎంజీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాల­యం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం. 
► పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్‌లలో రెండు ప్రత్యేక విద్యాలయాలు. 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యేంత వరకు నాణ్యమైన విద్య. 

యువ మహిళా సాధికారత 
► మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు 
► 18 ఏళ్లు పైబడిన చదువుకునే యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement