నిరుద్యోగ యువతకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది : మాజీమంత్రి హరీశ్‌రావు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): నిరుద్యోగులు, నిరుద్యోగ సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిరుద్యోగ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏడు రోజులుగా గాం«దీఆస్పత్రిలో ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్న నిరుద్యో గ జేఏసీనేత మోతీలాల్‌నాయక్‌ను ఆదివారం హరీశ్‌రావు పరామర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మోతీలాల్‌నాయక్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి, ఇచి్చన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు
ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మోతీలాల్‌నాయక్ దీక్షను విరమించాలని, కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల హక్కుల పట్ల ప్రొఫెసర్ కోదండరాం పూర్తి బాధ్యత తీసుకొని, హామీలు అమ లు చేసేవిధంగా కృషి చేయాలని కోరారు. ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులపై కపటప్రేమ చూపించి అవసరం తీరిన తర్వాత వారి గుండెల మీద తన్నిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు నిరుద్యోగుల ఓట్ల కోసం కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి, రేవంత్‌రెడ్డి తదితరులు కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారని, బస్సుయాత్రలు చేశా రని, రాహుల్‌గాంధీని అశోక్‌నగర్ తీసుకొచ్చి ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యో గులకు రాలేదన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాసయాదవ్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
ఇవీ నిరుద్యోగ డిమాండ్లు..
⇒ గ్రూప్–1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1: 50 నుంచి 1:100కు పెంచాలి.
⇒ గ్రూప్–2కు రెండువేలు, గ్రూప్–3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామనే హామీ నిలబెట్టుకోవాలి. రెండు పరీక్షల మధ్య 2 నెలల సమయం ఉండాలి
⇒ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీ నిలబెట్టుకోవాలి.
⇒ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
⇒ మొదటి కేబిబినెట్ మీటింగ్‌లోనే మెగా డీఎస్సీ ప్రకటన హామీ నిలబెట్టుకోవాలి. 11 వేలతో కాకుండా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి
⇒ గురుకుల టీచర్ల పోస్టులను బ్యాగ్‌లాగ్‌లో పెట్టకుండా, హైకోర్టు తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి
⇒ జీఓ నంబరు 46 రద్దు చేయాలి. ఆ జీఓ ద్వారా ఏర్పడిన సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలి.
⇒ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడు నెలల బకాయితో సహా ప్రతినెల క్రమం తప్పకుండా నిరుద్యోగభృతి చెల్లించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment