ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం | Man cheat unemployed youth promising jobs in singapore | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

Published Sun, Sep 3 2017 7:41 PM | Last Updated on Tue, Sep 12 2017 1:46 AM

Man cheat unemployed youth promising jobs in singapore

హైదరాబాద్‌: సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై ఎల్‌బీనగర్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.  ఎల్‌బీనగర్‌లోని యన్‌టీఆర్‌నగర్‌ చెందిన జి.సంతోష్‌కుమార్‌కు ఏడాది క్రితం వరంగల్‌ జిల్లా సీతరాంపురం గ్రామానికి చెందిన  పొలకుర్తి సురేందర్‌తో పరిచయం ఏర్పడింది.
 
సింగపూర్‌లో ఉద్యోగం ఉందని నెలకు  రూ.లక్ష జీతం ఉంటుందని నమ్మించిన సురేందర్‌కు 2016లో సంతోష్‌ రూ.20 వేలు ఇచ్చాడు. డబ్బు తీసుకుని ఏడాది గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. ఫోన్‌ చేసినా అతను స్పందించకపోవడంతో  సంతోష్‌కూమర్‌ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement