దేశానికే దిశ నిర్ధేశం | Disha App Registration Mega Drive Srikakulam | Sakshi
Sakshi News home page

దేశానికే దిశ నిర్ధేశం

Published Sat, May 7 2022 1:43 PM | Last Updated on Sat, May 7 2022 1:54 PM

Disha App Registration Mega Drive Srikakulam - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మహిళలకు రక్షణ కల్పించడంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేశానికే ‘దిశ’ నిర్దేశం చేశారని రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నా రు. ఏపీ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ది శ యాప్‌ అమలుచేసే దిశగా అడుగు వేస్తున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలోని సన్‌రైజ్‌ హోటల్‌లో దిశ యాప్‌ రిజిస్ట్రేషన్స్‌ మెగా డ్రైవ్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జీఆర్‌ రాధిక అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా దిశ యాప్‌ ఆవశ్యకత, ప్రాధాన్యతను లఘు చిత్రం ద్వారా చూపించారు. 

మహిళల భద్రతకు ప్రాధాన్యత 
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దిశ యాప్‌ ద్వారా యువతులు నిర్భయంగా ఉండవచ్చని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్‌పై విద్యార్థినులు ఇంటి చుట్టుపక్కల వా రికి అవగాహన కల్పించాలని సూ చించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి మహిళాలోకం జేజేలు పలుకుతోందన్నారు. ఈ యాప్‌ ద్వారా రానున్న రో జుల్లో నేరాల సంఖ్య తగ్గతుందన్నారు. కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ఏపీలో అడుగులు పడుతున్నాయని తెలిపారు.   

దిశ ఓ రక్షణ కవచం 
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మహిళల భద్రతపై ఎస్పీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చు ట్టడం చాలా గొప్ప విషయమన్నారు. దిశ యాప్‌ అనేది ఒక రక్షణ కవచమని తెలిపారు. దిశ యాప్‌ ద్వారా ఢిల్లీలో ఆపదలో ఉన్న ఓ మహిళను సురక్షి తంగా కాపాడారని గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్, దిశ వాహనాలు, పెట్రోలింగ్‌ వాహనాలను ప్రవేశపెట్టి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.   

మీ వెంటే ఉంటుంది.. 
జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత మాట్లాడుతూ అక్క, అన్న అనుక్షణం మీతో ఉండలేకపోవచ్చని, దిశ యాప్‌ ప్రతి క్షణం మీ వెంటనే ఉంటుందని తెలిపారు. యాప్‌ ఉంటే పోలీసు రక్షణ ఉన్నట్టేనన్నారు.  

పాట అదుర్స్‌.. 
ప్రత్యేక ఆహ్వానితుడు, గాయకుడు, ఇండియన్‌ ఐడ ల్‌ విజేత రేవంత్‌ దిశ యాప్‌ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి పాడిన పాట అందరికీ ఆకట్టుకుంది. తన సొంత ఊరిలో ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. మ నపై మనం నమ్మకం పెట్టుకోవాలన్నారు. అనంతరం దిశ యాప్‌ రిజిస్ట్రేషన్‌ మెగా డ్రైవ్‌ చేపట్టి పెద్దఎత్తున దిశ యాప్‌లు రిజిస్ట్రేషన్‌ చేయించారు.  

యాప్‌ అందరికీ 
కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ మాట్లాడుతూ దిశ యాప్‌ ను ఆడ, మగ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దిశ యాప్‌ ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కి షేక్‌ చేస్తే పోలీసు వారికి సమాచారం చేరి తక్షణమే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి నైనా జైస్వాల్, ఎస్పీ, జెడ్పీ చైర్‌పర్సన్, జేసీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.  
∙ఈ సందర్భంగా నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి నిర్వహించి షార్ట్‌ఫిల్మ్‌ల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు శ్రీకాకుళం వాసి జర్నలిస్ట్‌ డోల అప్పన, డాక్టర్‌ మాదిన ప్రసాదరావు టీమ్‌కు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు కాశీబుగ్గ వాసి బోనెల గోపాలరావులకు మంత్రి చేతులమీదుగా అందించారు.  
కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వరరావు, పి.సోమశేఖర్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కేపీ గోపాల్, డీఎస్పీ ఎం.మహేంద్ర, శివరామి రెడ్డి, జి.శ్రీనివాసరావు, ప్రసాద రావు, సీఐ ఈశ్వర్‌ ప్రసాద్‌ అంబేడ్కర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

దిశ గొప్ప వరం
సమాజంలో స్త్రీ శక్తిని పెంపొందించడానికి దిశ గొప్ప వరం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి మానవతావాదిగా నిరూపించుకున్నారు. దిశ అనేది మహిళల రక్షణకు కేంద్ర బిందువులాంటి ఆయుధం. 
– నైనా జైస్వాల్, క్రీడాకారిణి  

నాన్నలా రక్షణ
దిశ యాప్‌ ఓ అన్నలా, నాన్నలా, అమ్మలా మహిళకు భద్రత ఇస్తుంది. ఈ యాప్‌ ఉంటే తల్లిదండ్రులు నిర్భయంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
 – పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్‌ 

మొదటి ప్రాధాన్యత
జిల్లాలో ప్రతి మహిళ భద్రతకు పోలీసు శాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆపద సమయంలో పో లీసుల సాయం పొందాలి. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే సరిపోదు. దిశ యాప్‌ ఉంటేనే స్మార్ట్‌. యాప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత మీ వివరాలను గోప్యంగా ఉంటాయి.   పురుషు లు కూడా  యాప్‌ను వినియోగించాలి. 
– జీఆర్‌ రాధిక, ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement