హింస లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : హింస లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. మానవ హక్కులే మహిళల హక్కులని నినదించారు. ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.దిల్షాద్, మహిళల హక్కుమాట్లాడుతూ దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరగడం వల్ల మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలను వ్యాపార వస్తువుగా చిత్రీకరించే ధోరణి పెరిగిందన్నారు. సైబర్‌నేరాలు కూడా పెరిగిపోయాయని తెలిపారు. ‘నిర్భయ’ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఎన్ని తెచ్చినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే నిర్వీర్యం కాకతప్పదన్నారు. మహిళల రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నేతలు అరుణ, బి.లక్ష్మిదేవి, రామాంజినమ్మ, అనంతమ్మ, సరళ, క్రాంతి, భాగ్య, ఫరియాద్, సులోచన, విజయతోపాటు మహిళలు పాల్గొన్నారు.