సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్(టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో జూన్ 27 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (హెచ్‌ఎస్‌ఏ) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన టీసీఎస్‌ఎస్ రక్త దాన శిబిరం-2021 విజయవంతం అయ్యింది. వరుసగా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరాన్ని టీసీఎస్‌ఎస్ నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ.. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా గోనె నరేందర్ రెడ్డి, శివ ప్రసాద్ ఆవుల మరియు ప్రవీణ్ మామిడాల వ్యవహరించారు.
ఈ రక్తదాన సేవ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్, ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్లా మరియు ఇతర సభ్యులు, శశిధర్ రెడ్డి, ధన్యవాదాలు తెలియచేశారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment