అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు.
ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి!
ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment