టోల్‌బూత్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 20 మంది దుర్మరణం | Truck Smashes Into Toll Booth, Several Killed And Injured | Sakshi
Sakshi News home page

టోల్‌బూత్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 20 మంది దుర్మరణం

Published Sun, Nov 7 2021 3:59 PM | Last Updated on Sun, Nov 7 2021 4:11 PM

Truck Smashes Into Toll Booth, Several Killed And Injured - Sakshi

మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్‌ మెక్సికోలోని రహదారిపై ఉన్న టోల్‌బూత్‌లోకి ఒక ట్రక్కు దూసుకురావడంతో 20 మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. టోల్‌బూత్‌ వద్ద ఆపి ఉంచిన వాహనాలపైకి ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవ దహనమయ్యారు.

ట్రక్కు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ కూడా మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. నవంబర్‌ 1వ తేదీ నుంచి చూస్తే సెంట్రల్‌ మెక్సికోలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పరుస్తున్నాయి. 

ఆయిల్‌ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement