డ్రైవర్‌ వింత ప్రవర్తన.. ప్యాంటు, జాకెట్‌ను చెక్‌ చేస్తే 9 పాములు, 43 బల్లులు | Usa: California Border Authorities Caught 52 Reptiles Hidden In Man Clothing In Telugu | Sakshi

డ్రైవర్‌ వింత ప్రవర్తన.. ప్యాంటు, జాకెట్‌ను చెక్‌ చేస్తే షాక్‌.. ఏకంగా 9 పాములు, 43 బల్లులు

Mar 9 2022 6:11 PM | Updated on Mar 9 2022 9:01 PM

Usa: California Border Authorities Caught 52 Reptiles Hidden In Men’s Clothing In Telugu - Sakshi

మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్‌సిడ్రో సరిహద్దు వద్దకు ఓ వ్యక్తి ట్రక్కుతో వచ్చాడు. అయితే ..

కాలిఫోర్నియాలోని అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి దుస్తుల్లో ఏకంగా 52 బల్లులు, పాములు బయటపడటంతో బోర్డర్‌ అధికారులు షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్‌సిడ్రో సరిహద్దు వద్దకు ఓ వ్యక్తి ట్రక్కుతో వచ్చాడు. అయితే తనిఖీల్లో భాగంగా అధికారులు అతన్ని బయటకు పిలిచారు. ఈ క్రమంలో అతని ప్రవర్తన వింతగా ఉండేసరికి అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేసేసరికి అసలు బాగోతమంతా బయటపడింది. (చదవండి: యుద్దం ఎఫెక్ట్‌.. దేశం వీడుతున్న ప్రేయసి‌.. లవ్‌ ప్రపోజ్‌ చేసిన ఉక్రెయిన్‌ సైనికుడు.. వీడియో వైరల్‌ )

అతను ఏకంగా 52 సరీసృపాలను చిన్న చిన్న సంచుల్లో దాచి సరఫరా చేసేందుకు ప్రయత్నించాడు. 9 పాములు, 43 అరుదైన బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి వేసుకున్న జాకెట్, ప్యాంటు పాకెట్లు, ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ వాటిని దాచిపెట్టుకుని సరిహద్దు దాటేందుకు ప్రయత్నించబోయాడు. అతను తరలిస్తున్న వాటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. "స్మగ్లర్లు ఇలాంటి వాటిని సరఫరా చేసేందుకు రకరకాల దారులు ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement