కుక్క నోట్లో మనిషి తల.. అక్కడంతే! | Mexico: Street Dog Running Human Head Its Mouth On Roads Viral | Sakshi
Sakshi News home page

వీడియో: కుక్క నోట్లో మనిషి తల.. రోడ్ల వెంట పరుగులు! అక్కడది షరా మామూలే!

Published Tue, Nov 1 2022 2:43 PM | Last Updated on Tue, Nov 1 2022 2:43 PM

Mexico: Street Dog Running Human Head Its Mouth On Roads Viral - Sakshi

చిమ్మ చీకట్లో.. మనిషి తల నోట కర్చుకుని రోడ్ల వెంట పరిగెడుతున్న ఓ కుక్క. సడన్‌గా ఆ దృశ్యం చూసిన ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. అయితే ఆ వీడియోనే ట్విట్టర్‌ ద్వారా విపరీతంగా వైరల్‌ అవుతోంది. చివరికి.. రంగంలోకి దిగిన పోలీసులు దాని వెంటపడ్డారు. ఓ పోలీస్‌ అధికారి బలవంతంగా దాని నోటి నుంచి ఆ తలను బయటకు తీశాడు. అయితే.. ఆ వీడియో ఎక్కడిది అనే విషయంపై ఇప్పుడొక స్పష్టత వచ్చింది. 

మెక్సికో దేశంలోని జకాటెకాస్‌ స్టేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత బుధవారం ఈ ఘటన జరిగిందని ఫాక్స్‌ న్యూస్‌ వెల్లడించింది. క్రైమ్‌ సీన్‌ నుంచి తల తీసుకుని ఆ వీధి కుక్క పరిగెత్తిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోంటే ఎస్కోబెడో టౌన్‌లోని ఓ బూత్‌లో ఆ తలను దుండగులు ఉంచినట్లు నిర్ధారించారు. అంతేకాదు.. అక్కడ ‘తర్వాతి తల నీదే’ అనే హెచ్చరికను సైతం గుర్తించారు. అయితే.. 

ఇలాంటి వ్యవహారాలను అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కారణం.. అది అక్కడ సర్వసాధారణం కాబట్టి.  కార్టెల్‌ జలిస్కో న్యుయెవ జెనెరసియాన్‌.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డ్రగ్స్‌ ముఠాలకు అడ్డా. సినాలోవా, జలిస్కో డ్రగ్‌ కార్టెల్స్‌ అక్కడ అత్యంత శక్తివంతమైన గ్యాంగ్‌లను నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలోనే సదరు మొండెం లేని తల పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా.. కిందటి నెలలో గుర్రెరో స్టేట్‌లో  రెండు ముఠాలు.. భారీ ఎత్తున హింసకు పాల్పడ్డాయి. ఈ ముఠా కక్షలో పద్దెనిమిది మంది మృతి చెందగా.. అందులో ఓ మేయర్‌, మాజీ మేయర్‌ కూడా ఉన్నారు.

warning: some viewers may find the following video disturbing

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement