ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.
ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment