మెక్సికో: మెక్సికో సిటీ ఎయిర్‌పోర్టులో ఒక మహిళ ప్రయాణానికి సంబంధించి తాను రిజర్వేషన్ చేసుకున్న టికెట్ వివరాలు కంప్యూటర్లో కనిపించకపోయే సరికి కోపంతో అక్కడి సిబ్బందిపై వీరంగం చేసి ఆఫీసులోని పరికరాలను ధ్వంసం చేసింది.
వివరాల్లోకి వెళ్తే మరియ గువాడులూపే(56) అనే మహిళ , మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణానికి ముందుగానే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకుంది. యధాలాపంగా చెకిన్ అవడానికి బోర్డింగ్ పాస్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లగా ఆమె వివరాలు కంప్యూటర్లో ఎంత వెతికినా కనిపించక ఆమె ప్రయాణం చేయడానికి కుదరదని చెప్పారు వోలారిస్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి.
దీంతో ఆమె.. నా టికెట్ డబ్బులు నాకు తిరిగి వాపసు ఇవ్వమని అడిగింది. అందుకు వోలారిస్ ప్రతినిధి స్పందిస్తూ.. డబ్బులు కావాలంటే మీరు బుక్ చేసిన ఏజెన్సీకి వెళ్లి అడగాలని కోరారు. అంతే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ ఆఫీసులోకి చొరబడి అక్కడి ఉద్యోగులను నానా మాటలంటూ.. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీరంతా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అరుస్తూ అక్కడి పరికరాలను ఇష్టమొచ్చినట్టు విసిరేస్తూ విధ్వంసం చేసింది.
ఆమె కోపానికి నాలుగు కంప్యూటర్ మానిటర్లు నాలుగు బార్ కోడ్ స్కానర్లు ధ్వంసమయ్యాయి. చేసిందంతా చేసి గువాడులూపే తనదారిన తాను వెళ్లిపోయే ప్రయత్నం చేయగా అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.
Pierde vuelo y el autocontrol:
— Antonio Nieto (@siete_letras) July 5, 2023
Es María Guadalupe (56). Exigió reembolso a @viajaVolaris, se lo negaron y arremetió contra empleados en @AICM_mx.
Destrozó 4 monitores y escaners, por lo cual fue detenida. pic.twitter.com/hZHa5NDd1n
ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment