మెక్సికోలోని ఓ మద్యం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా పేలుడు సంభవించి, తరువాత ఫ్యాక్టరీ అంతటా మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర పౌర రక్షణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రమాద వివరాలను తెలియజేసింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులంతా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని ఏజెన్సీ తెలిపింది. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో నిపుణులు ఉన్నారని రాష్ట్ర పౌర రక్షణ శాఖ డైరెక్టర్ విక్టర్ హ్యూగో రోల్డాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment