Hundreds Of Yellow Headed Blackbirds Falling From The Sky: ఇంతవరకు మనం జంతువులకు, పక్షులకు సంబంధించిన రకరకాల వైరల్ వీడియోలను చూశాం. అంతేకాదు వివిధ రకాల అందమైన పక్షులు సందడి చేసి అలరించిన వీడియోలను వీక్షించాం. గానీ ఒకేసారి పక్షలు మంద ఆకాశంలో విహరిస్తూ చనిపోవడం వీడియోల్లో చూసి ఉండం. అలాంటి సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే...మెక్సికోలో పసుపు రంగు తలతో ఉన్న ఒకే రకమైన వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ చనిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో వందలాది పక్షలు మందగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి భూమి మీద పడి విగత జీవులుగా మారిపోయాయి. అందులో కొన్ని నెమ్మదిగా తేరుకుని ఎగిపోయాయి కూడా.
నిపుణలు మాత్రం బహుశా ఒక వేటాడే పక్షి ఈ పక్షలు మందను వేటాడి ఉండవచ్చు. అప్పుడు ఒకేసారి ఎగిరే క్రమంలో ఒక్కసారిగా కింద పడి చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ బ్రౌటన్ మాట్లాడుతూ.. "పెరెగ్రైన్ లేదా హాక్ వంటి రాప్టర్ పక్షుల మందను వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆ క్రమంలో ఆ పక్షలు మంద బలవంతంగా కిందకు వెళ్లడంతో అవి చనిపోయాయి" అని అన్నారు. అంతేకాదు వీడియో ఫుటేజ్‌లో వందలాది పక్షలు వీధుల్లో హఠాత్తుగా పడిపోయినట్లు కనిపించింది. పైగా అందులో చాలా వరకు ఎగిరిపోగా...కొన్ని చెల్లాచెదురుగా పడిపోయి చనిపోయి ఉన్నాయి. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు ఈ వీడియో వెనుక 5 జీ సాంకేతికత ఉందని కొందరు , మరికొందరేమో షార్ట్ సర్యూట్ జరడంతోనే అవి అలా పడిపోయాయి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
WARNING: GRAPHIC CONTENT
— Reuters (@Reuters) February 14, 2022
Security footage shows a flock of yellow-headed blackbirds drop dead in the northern Mexican state of Chihuahua pic.twitter.com/mR4Zhh979K
(చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!)
Comments
Please login to add a commentAdd a comment