మెక్సికో: మెక్సికోలో మరోసారి పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టంగానీ ఆస్తి నష్టంగానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు.
మెక్సికో నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం సెంట్రల్ మెక్సికోలో తెల్లవారుజాము 2.00 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం భూమి ఉపరితలానికి సుమారు 10 కి.మీ లోతున సంభవించి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
మళ్ళీ మళ్ళీ..
మెక్సికోలో భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి సర్వసాధారణంగానే జరుగుతుంటాయి. గత నెలలోనే పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపం వచ్చింది.
మే 18న గ్వాటెమాల, దక్షిణ మెక్సికో ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత 6.6గా నమోదవ్వగా మే 25న పనామా-కొలంబియా సరిహద్దులో వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు.
ఇది కూడా చదవండి: గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు!
Comments
Please login to add a commentAdd a comment