central Mexico
-
మెక్సికోలో పెను భూకంపం..
మెక్సికో: మెక్సికోలో మరోసారి పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టంగానీ ఆస్తి నష్టంగానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మెక్సికో నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం సెంట్రల్ మెక్సికోలో తెల్లవారుజాము 2.00 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం భూమి ఉపరితలానికి సుమారు 10 కి.మీ లోతున సంభవించి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ.. మెక్సికోలో భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి సర్వసాధారణంగానే జరుగుతుంటాయి. గత నెలలోనే పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపం వచ్చింది. మే 18న గ్వాటెమాల, దక్షిణ మెక్సికో ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత 6.6గా నమోదవ్వగా మే 25న పనామా-కొలంబియా సరిహద్దులో వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు. ఇది కూడా చదవండి: గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు! -
సెంట్రల్ మెక్సికోలో కాల్పులు.. 19 మంది మృతి
మెక్సికో: మెక్సికో దేశంలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలో గుర్తు తెలియని వ్యక్తులు జరిగిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మిచోకాన్ రాష్ట్రంలోని లాస్ టినాజాస్ పట్టణంలో ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ ఉత్సవంలో గుమిగూడిన వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 19 మంది మృతదేహాలను గుర్తించినట్లు, వీరిలో 16 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలపై తుపాకీ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఫెడరల్ అధికారులు పనిచేస్తున్నారని మిచోకాన్ పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ కార్యాలయం ట్విటర్లో తెలిపింది. చదవండి: Ukraine: న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా? కాగా మిచోకాన్ దాని పరిసర ప్రాంతం గునజుటో మెక్సికోలోనే అత్యంత హింససాత్మక ఘటనలు చోటుచేసుకునే రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నిత్యం కాల్పులు జరుపుతూ ఉంటాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయిల్ దొంగతనం సహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో కాల్పుల్లో ప్రతి ఏడాది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత -
మెక్సికోను కుదిపేసిన భూకంపం
-
మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం
-
మెక్సికోను కుదిపేసిన భూకంపం
-
మెక్సికోను కుదిపేసిన భూకంపం
మెక్సికో సిటీ: మెక్సికో దేశాన్ని మంగళవారం అత్యంత శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 226మందికి పైగా మరణించారు. మృతుల్లో 21 మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వేలాది మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్యూబ్లాకు తూర్పు వైపున భూకంప కేంద్రం నమోదైనట్లు మెక్సికో భూకంప శాస్త్ర అధ్యయన సంస్థ తెలిపింది. ప్యూబ్లా, మొర్లస్, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. ఇటీవలే భూకంపం, తుపాను వల్ల మెక్సీకో తీవ్రంగా నష్టపోయింది. 1985 సెప్టెంబర్ 19న కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. నాటి ప్రమాదంలో దాదాపు 10 వేల మంది వరకు మృతి చెందారు. 32 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు(మంగళవారం) భారీ భూకంపం సంభవించింది. మెక్సికోకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపిస్ట్ కాల్పుల కలకలం.. 11 మంది మృతి
మెక్సికో: కొందరు ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయారు. సెంట్రల్ మెక్సికోలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ రేపిస్ట్ సహా మరో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక మేయర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబంపై కక్షగట్టిన వ్యక్తి, మరోకరితో కలిసి సాయుధులుగా ఇంట్లోకి ప్రేవేశించి కాల్పులు జరిపి 11 మందిని హతమార్చారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, నలుగురు మగవాళ్లు ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని తెహ్యూకన్లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాల్పులు జరిపినప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఐదుగురు వ్యక్తులు ప్రభుత్వ అధికారుల సంరక్షణలో ఉన్నారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలతో ఇద్దరు నిందితులను గుర్తించామని, చనిపోయిన మహిళల్లో ఒకరిని నిందితులలో ఒకడు గతంలో రేప్ చేశాడని తెలిపారు. అత్యాచారం విషయంపై నిందితుడితో ఆ కుటుంబానికి తగాదాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో ఉన్న వాళ్లను హత్యచేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.