magnitude 6.3
-
వారంలోనే అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం
చాహక్: అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదయ్యింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు భూమి కంపించింది. పశ్చిమ అఫ్గానిస్తాన్‌లో హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది ఇటీవలె అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని పెనుభూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. -
మెక్సికోలో పెను భూకంపం..
మెక్సికో: మెక్సికోలో మరోసారి పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టంగానీ ఆస్తి నష్టంగానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మెక్సికో నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం సెంట్రల్ మెక్సికోలో తెల్లవారుజాము 2.00 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం భూమి ఉపరితలానికి సుమారు 10 కి.మీ లోతున సంభవించి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ.. మెక్సికోలో భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి సర్వసాధారణంగానే జరుగుతుంటాయి. గత నెలలోనే పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపం వచ్చింది. మే 18న గ్వాటెమాల, దక్షిణ మెక్సికో ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత 6.6గా నమోదవ్వగా మే 25న పనామా-కొలంబియా సరిహద్దులో వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు. ఇది కూడా చదవండి: గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు! -
రష్యాలో భూకంపం..6.3 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దక్షిణ రష్యాలోని కురిలె ఐలాండ్‌లో బుధవారం భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా, దీనివల్ల చోటుచేసుకున్న ఆస్తి, ప్రాణనష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సెవెరో కురిల్స్క్ వద్ద 34 కిలోమీటర్ల లోతులోని భూకంప కేంద్ర నుంచి ప్రకంపనలు వ్యాపించినట్లు తెలిసింది.