చాహక్: అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదయ్యింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు భూమి కంపించింది. పశ్చిమ అఫ్గానిస్తాన్‌లో హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది
ఇటీవలె అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని పెనుభూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment