ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది శరణార్థులు మృతి.. 29 మందికి గాయాలు.. | Mexico Migrant Detention Center Fire Accident Many Dead | Sakshi
Sakshi News home page

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది శరణార్థులు మృతి.. 29 మందికి గాయాలు..

Published Tue, Mar 28 2023 9:30 PM | Last Updated on Tue, Mar 28 2023 9:30 PM

Mexico Migrant Detention Center Fire Accident Many Dead - Sakshi

మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 39 మంది దుర్మరణం చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ శరణార్థి కేంద్రంలో పరుపులకు నిప్పంటించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్​లో ఈ శరణార్థి కేంద్రం ఉంది.  ఇతర దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ఈ ప్రాంతం ముఖ్యమైంది.  అమెరికా ఆశ్రయం కోరేవారు  అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటారు.

అయితే వలసదారులందరినీ వెనక్కి పంపిస్తున్నారని ఎవరో ప్రచారం చేయడంతో శరణార్థి కేంద్రంలో ఉన్నవారంతా సోమవారం రాత్రి నిరసనలకు దిగారు. ఇందులో భాగంగానే కొందరు పరుపులకు నిప్పు అంటించడంతో ఆ మంటలు క్షణాల్లోనే వ్యాపించి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలకు 39 మంది బలయ్యారు.
చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement