ప్రతి మనిషి బాగా డబ్బు సంపాదించాలని, నచ్చినట్టు జీవించాలని కలలు కంటూ.. దీనికోసం ప్రయత్నిస్తుంటారు. కొంతమంది తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటే.. మరికొందరు ఈ లక్ష్య సాధనలోనే కన్ను మూసేస్తున్నారు. అయితే వేలకోట్లు సంపాదించిన లూమ్ కో-ఫౌండర్ 'వినయ్ హిరేమత్' మాత్రం, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
కేవలం 33 సంవత్సరాల వయసున్న భారతీయ సంతతికి చెందిన వినయ్ హిరేమత్ (Vinay Hiremath).. లూమ్ (Loom) కంపెనీ స్థాపించి, దానిని 2023లో అట్లాసియన్ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు.
కంపెనీ విక్రయించిన తరువాత.. వినయ్ హిరేమత్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చాలా ప్రయాణాలు చేసి, ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. ఆ తరువాత తనకున్న అభద్రతా భావం వల్ల ఆమెకు దూరంగా ఉండిపోయాడు. ఈ పోస్ట్ చదువుతున్నట్లయితే.. నేను ఆమెకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు నచ్చిన విధంగా ఉండలేకేపోయాను. నీవు అందించిన అనుభూతులకు కృతజ్ఞతలు అని వెల్లడించారు.
లూమ్ కంపెనీ విక్రయించిన తరువాత.. అట్లాసియన్ కంపెనీలోని ఉద్యోగం చేసే అవకాశం లభించింది. అక్కడ అతని ప్యాకేజీ 60 మిలియన్ డాలర్లు (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ). అయినా వినయ్ హిరేమత్ ఈ ఆఫర్ వదులుకున్నారు. రోబోటిక్ కంపెనీ సహా ఇతర వెంచర్‌లను స్థాపించాలని అనుకున్నారు. కానీ అది తన నిజమైన అభిరుచి కాదని వెంటనే గ్రహించి వదులుకున్నారు.
ఇదీ చదవండి: రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?
ప్రస్తుతం హిరేమత్.. వాస్తవ ప్రపంచ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీని ప్రారంభించాలనే లక్ష్యంతో భౌతికశాస్త్రం నేర్చుకుంటున్నట్లు సమాచారం. నేను ప్రారంభించబోయే కొత్త వెంచర్ గొప్ప విజయాలను సాధించాలని, లాభాలను ఆర్జించాలని లేదు. నేను ప్రస్తుతం చాలా సంతృప్తిగా ఉన్నానని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
I am rich and have no idea what to do with my life.
Where I talk about leaving Loom, giving up $60m, larping as Elon, breaking up with my girlfriend, insecurities, a brief stint at DOGE, and how I'm now in Hawaii self-studying physics.https://t.co/cMgAsXq3St— Vinay Hiremath (@vhmth) January 2, 2025
లూమ్ కంపెనీ
లూమ్ అనేది 2015లో స్థాపించిన టెక్ కంపెనీ. ఇది వీడియో కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంది. కెమెరా రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, వీడియో ఎడిటింగ్, షేర్ చేయగల స్క్రీన్ రికార్డెడ్ వీడియో లింక్‌ని సృష్టించడం వంటి సాంకేతికతలను అందిస్తుంది. ఈ కంపెనీ విలువ 2022లో 1.5 బిలియన్ డాలర్లు. అయితే దీనిని 2023 నవంబర్ 30న ఆస్ట్రేలియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన అట్లాసియన్ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment