మాస్కో: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ఆహార, ఇంధన సంక్షోభానికి పశ్చమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తప్పులన్నీ అవి చేసి, ఇప్పుడు నెపాన్ని రష్యాపై మోపుతున్నాయంటూ మండిపడ్డారు. రష్యాపై అవి విధించిన ఆంక్షలు ప్రపంచ మార్కెట్లను మరింతగా కుంగదీయడం ఖాయంమని జోస్యం చెప్పారు.
యూరప్ దేశాల మతిలేని విధానాల వల్లే రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇదంతా పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారమే. ఉక్రెయిన్ తన రేవు పట్టణాల్లోని తీర జలాల నుంచి మందుపాతరలను తొలగించే పక్షంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాల రవాణాకు భరోసా కల్పిస్తాం’’ అని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment